लक्ष्यशुद्धिः

2. स्वशिष्याणां लक्ष्यप्रहरणज्ञानं द्रोणः कथं परीक्षितवान् ? /ग्राहग्रस्तं गुरुम् अर्जुनः कथम् अरक्षत् ? गुरुः तस्मै किम् अदात् ?

కవిపరిచయం:- “లక్ష్యశుద్ధి” అను ఈ పాఠము వేదవ్యాసమహర్షిచే రచింపబడిన శ్రీమన్మహాభారతమునందలి ఆదిపర్వము నుండి స్వీకరించబడినది. ఇందు ద్రోణాచార్యుడు తన శిష్యులైన కురు రాజకుమారుల యొక్క విలువిద్యానైపుణ్యమును పరీక్షించుట వర్ణించబడినది.

ద్రోణాచార్యుడు రాజకుమారులను పరీక్షించుట:- కురు రాజకుమారులకు అస్త్రవిద్యలు నేర్పుచున్న
ద్రోణాచార్యుడు వారి లక్ష్యశుద్ధిని పరీక్షింపదలచి, ఒక పక్షి బొమ్మను చెట్టు చిటారు కొమ్మన ఉంచి రాజకుమారులను ఒక్కొక్కరినీ పిలిచి ఆ ప్రతిమ యందే దృష్టిని ఉంచవలెననీ, ధనుస్సును సంధించి సిద్ధముగా ఉండుమని ఆదేశించెను.

ద్రోణుడు ధర్మరాజును పరీక్షించుట: – ద్రోణాచార్యుడు మొదట ధర్మరాజును పిలిచి ధనుస్సును ఎక్కుపెట్టమని, చెట్టుచిటారు కొమ్మన పక్షి కన్పించుచున్నదా? అని ప్రశ్నించెను. దానికి ధర్మరాజు “పక్షి కన్పించుచున్నదని”
సమాధానమిచ్చెను. మరల ద్రోణుడు, “నేను,ఈ వనము,నీ సోదరులు కన్పించుచున్నారా?”అని ప్రశ్నించగా, ధర్మరాజు “పక్షితో కూడి అందరూ కన్పించుచున్నారని” పలికెను. ఆ సమాధానమునకు ద్రోణుడు అప్రసన్నుడై ధర్మరాజుతో “నీవు లక్ష్యమును ఛేదింపలేవు, తొలగిపొమ్మని” ఆజ్ఞాపించెను.

ద్రోణుడు కురు రాజకుమారులను పరీక్షించుట:-ధర్మరాజు సమాధానమునకు అప్రసన్నుడైన ద్రోణాచార్యుడు మిగిలిన రాకుమారులనూ, భీమాదులనూ అట్లే ప్రశ్నించెను. వారందరునూ ధర్మరాజు వలెనే వనము, సోదరులు, పక్షి కనబడుచున్నారని పలికిరి.

ద్రోణాచార్యుడు అర్జునుని ప్రశ్నించుట:-అప్పుడు ద్రోణాచార్యుడు అర్జునునితో “నీవు ఈ లక్ష్యమును ఛేదింపవలెను, ధనుస్సును ఎక్కుపెట్టి సిద్ధముగా నుండుము” అని పలికెను.

त्वयेदानीं प्रहर्तव्यं एतल्लक्ष्यं निशम्यताम् ।

అర్జునుడు గురువు చెప్పినట్లే చేసెను. అప్పుడు ద్రోణుడు అందరినీ ప్రశ్నించినట్లే “నీకు చిటారుకొమ్మన పక్షి కన్పించుచున్నదా?” మేము, ఈ వనము కన్పించుచున్నామా? అని ప్రశ్నించెను. దానికి అర్జునుడు “పక్షితల మాత్రమే కన్పించుచున్నది. దాని శరీరముకాని,ఈ వనము, మీరు కానీ నాకు కనబడుటలేదు” అని పలికెను.

అర్జునుడు గురువు చెప్పినట్లే చేసెను. అప్పుడు ద్రోణుడు అందరినీ ప్రశ్నించినట్లే “నీకు చిటారుకొమ్మన పక్షి కన్పించుచున్నదా?” మేము, ఈ వనము కన్పించుచున్నామా? అని ప్రశ్నించెను. దానికి అర్జునుడు “పక్షితు మాత్రమే కన్పించుచున్నది. దాని శరీరముకాని,ఈ వనము, మీరు కానీ నాకు కనబడుటలేదు” అని పలికెను.

शिरः पश्यामि भासस्य न गात्रम् ।

ఆ సమాధానమునకు మిక్కిలి సంతోషించిన ద్రోణుడు శరమును సంధించుమని ఆజ్ఞాపించెను. అర్జునుడల్లే చేయగా దాని తల తెగి నేలరాలెను. అది చూచి ద్రోణుడు అర్జునుని కౌగలించుకొని అభినందించెను.

तस्मिन्कर्मणि संसिद्धे पर्यष्वजत फल्गुणम् ।

అర్జునుడు ద్రోణుడిని మొసలి బారి నుండి కాపాడుట:- ఒకసారి ద్రోణాచార్యుడు తన శిష్యులతో
గంగానదీ స్నానమునకు వెళ్ళెను. నదిలోకి దిగిన ద్రోణుని కాలును ఒక మొసలి పట్టుకొనినది. ద్రోణుడు ఆ మొసలి బారి నుండి తనను తాను కాపాడు కొనగలిగియూ, శిష్యులతో “ఈ మొసలిని చంపి నన్ను కాపాడుమని”
ఆజ్ఞాపించెను.
ग्राहं हत्वा मोक्षयध्वं माम्।

గురువు మాటలను విన్న శిష్యులందరునూ మౌనముగా నుండి పోయిరి. అర్జునుడు మాత్రము వెంటనే తన ధనుర్విద్యా కౌశలమును ప్రదర్శించి ఐదు బాణములతో ఆ మొసలిని నీటి యందే కొట్టెను. ఆ శరముల తాకిడికి మొసలి శరీరము ముక్కలై మరణించెను.

ద్రోణుడు అర్జునునికి దివ్యాస్త్రమును బహుకరించుట:- తనను మకర బంధనము నుండి కాపాడిన అర్జునునకు ద్రోణుడు “బ్రహ్మశిరము” అను పేరుగల దివ్యాస్త్రమును బహుమతిగా నిచ్చెను. ఆ అస్త్రప్రభావమునిట్లు తెల్పెను, “ఓ అర్జునా ! ఈ అస్త్రము అల్ప తేజస్సుగల మానవులపై ప్రయోగింపరాదు. అట్లు ప్రయోగించిన ఆ ప్రదేశమంతయూ భస్మమగును. అసామాన్యమైన అస్త్రముగా ఖ్యాతిగాంచిన దీనిని యుద్ధమున శత్రునాశనము కొరకు మాత్రమే వినియోగించవలెను”.

गुरुः पार्थाय ब्रह्मशिरः नामानम् अस्त्रं ददौ ।

అర్జునుని ద్రోణాచార్యుడు ప్రశంసించుట:- ఆ దివ్యాస్త్రమును తన గురువు నుండి పొందిన అర్జునుడు
“అట్లే చేయుదునని” ద్రోణునకు ప్రమాణము చేసి నమస్కరించెను. అర్జునుని వినయమునకూ, ధనుర్విద్యా కౌశలమునకు మిగుల సంతోషించిన ద్రోణాచార్యుడు, అతనిని “నీ వంటి విలుకాడు లోకములో ఉండడని”
దీవించెను.

ఉపసంహారము:- ఈ విధముగా అర్జునుడు తను లక్ష్యశుద్ధిని నిరూపించుకొని, గురువును మొసలినుండి కాపాడి తన గురువైన ద్రోణుని ఆశీస్సులతో అజేయుడై నిలిచెను.
                         

Introduction: The present lesson लक्ष्यशुद्धिः is an extract from 126th canto of Adiparva of Mahabharatha written by Vedavyasa.

Sage Vedavyasa was treated as incarnation of Lord Vishnu. He wrote eighteen puranas and Mahabharata. He became Vedavyasa, editing great Veda into four parts. He was also called as Parasara, Badarayana and Krishna dwaipayana. Mahabharata is popular as Panchama Veda.

Test of Drona:- Drona was teaching all warfare subjects to scions of Kuru dynasty. He wanted to test their capability in archery. He got an artificial bird prepared by sculptor and placed it at the top most branch of a tree. Now, Drona asked everyone to be ready with bows and arrows to shoot the bird at the end of his words.

त्वयेदानीं प्रहर्तव्यम् एतल्लक्ष्यं निशम्यताम् ।

First, he called Dharma Raja and asked to see the bird. Dharma Raja replied, he is observing bird, tree, brothers, and you (Master). Master sent him away. He called every child of Pandu the king and had same reply like Dharma Raja. He called Duryodhana and his brothers too for same test. But he was unhappy as these do not have good concentration in observing the bird.

Arjuna’s aim:- Then Drona called Arjuna and ordered him to target bird and be ready to hit it at the end of his words. When the teacher questioned about observation of bird,Arjuna replied that he could see only the head of the bird.शिरः पश्यामि न गात्रम् ।The teacher was happy and said a good archer must observe only target not else.

तस्मिन्कर्मणि संसिद्धे पर्यष्वजत फल्गुणम् ।

He ordered Arjuna to hit it and latter followed the same hitting head of bird.

Redeeming the master from the crocodile:- Once Drona went to the river Ganges to take bath along with disciples. As soon as Drona entered the river he was caught by a crocodile. Though, he could get himself released, he wanted to test the ability of his students once again and asked them to get him released.

ग्राहं हत्वा मोक्षयध्वं माम् ।

Except Arjuna none came forward to rescue their teacher, saying it is not possible to hit aquatic being in water. He made crocodile into pieces with five arrows and saved the teacher.

Gift of Drona:- Drona was pleased and presented Arjuna a powerful Astra Brahma Sira, with a warning not to use on ordinary people. If it is misused the world will be destroyed.

जगद्विनिर्दहेदत् अलपतेजसि पातित् ।

Conclusion:- Thus Arjuna’s steady concentration लक्ष्यशुद्धिः was appreciated by his master, who made him as an extraordinary Archer.

Leave a Comment