रामो विग्रहवान् धर्मः

1. रामः कः ? सः किमर्थं चित्रकूटम् अगच्छत् ? तत्र किमभवत् ? /रामस्य वनवासं वर्णयत ।

కవిపరిచయము: रामो विग्रहवान् धर्मः

అను ప్రస్తుతపాఠ్యభాగము వాల్మీకి మహర్షి చే రచింపబడిన“రామాయణము” అను మహాకావ్యములోని బాలకాండములోని ప్రథమసర్గనుండి గ్రహింపబడినది. ఈ పాఠ్యభాగమున నారదమహర్షి శ్రీరాముని గొప్పగుణములను తెలియపరుస్తూ వాల్మీకిమహర్షికి వివరించెను.నారదమహర్షిని వాల్మీకి ప్రశ్నించుట -వాల్మీకి మహర్షి నారదుని ఈ విధముగా ప్రశ్నించెను. “ప్రస్తుత ఈ లోకములో మంచి గుణములు కలవాడు, పరాక్రమవంతుడు, చేసినమేలు మరువనివాడు, ధర్మాత్ముడు, సత్యమునే పలుకువాడు, గట్టిసంకల్పం కలవాడు ఎవరైనా వున్నారా ?

”धर्मज्ञश्च कृतज्ञश्च सत्यवाक्यो दृढव्रतः ।

అప్పుడు నారదుడు వాల్మీకి మహర్షితో ఇలా పలికెను.

శ్రీరాముని గుణములను నారదుడు వర్ణించుట -ఇక్ష్వాకువంశములో పుట్టినవాడు శ్రీరాముడు. ఇతడు ” స్థిరబుద్ధి కలవాడు, మహావీరుడు, ప్రకాశవంతుడు ధైర్యవంతుడు మరియు జితేంద్రియుడు”.సకలధర్మములను తెలిసినవాడు శ్రీరాముడు. సత్యమునే పలుకువాడు. ప్రజలహితమునే కోరుకొనేవాడు. మంచి హృదయం కలవాడు. శ్రీరాముడు దశరథ మహారాజు యొక్క పెద్దకుమారుడు. ప్రజలకు మేలు చేయదలచి దశరథుడు రాముని యువరాజుగా నియమించవలెనని సంకల్పించాడు”

.శ్రీరాముడు అడవులకు వెళ్ళుట-

దశరథుని భార్య కైకేయి రాముని పట్టాభిషేక ఏర్పాట్లను చూచి తనకు పూర్వం ఇస్తానని పలికిన రెండు వరములు ఇవ్వమని దశరథుని కోరినది.

पूर्वं दत्तवरा देवी वरमेनमयाचत ।

ఆ రెండు వరములలో మొదటిది రాముడు అడవికి వెళ్ళుట. రెండవది తన కుమారుడు భరతునికి పట్టాభిషేకము చేయుట.దశరథుడు రాముని వనవాసమునకు వెళ్ళమని చెప్పగా, తండ్రి మాటవిని రాముడు అడవికివెళ్ళుటకు నిర్ణయించుకున్నాడు. రామునితో తన ప్రియసోదరుడు లక్ష్మణుడు అనుసరించెను.

तं व्रजन्तं प्रियो भ्राता लक्ष्मणः अनुजगाम ह ।

చంద్రుని అనుసరించు రోహిణి వలె అతని భార్య సీత రాముని వెంట అడవులకు వెళ్ళెను.

सीताऽप्यनुगता रामं शशिनं रोहिणी यथा ।

తరువాత రాముడు రాజభవనాన్ని విడిచి మొదటగా శృంగిబేరపురంలోని గుహుడు అనే నిషాదరాజుని కలుసుకొనెను. రథసారధిగా వచ్చిన సుమంత్రుని అయోధ్యకు పంపివేసెను. అటుతరువాత రాముడు, సీతాలక్ష్మణులు గుహునితో కలిసి గంగానదిని దాటిరి.

శ్రీరాముడు చిత్రకూటములో నివసించుట –

భరద్వాజ మహర్షి ఆదేశమును అనుసరించి రాముడు సీతాలక్ష్మణులతో కలసి చిత్రకూటము చేరుకొనెను. పుత్రవియోగమును తట్టుకొనలేక దశరథుడు మరణించాడు. మహాబలశాలియైన భరతుడు రాజ్యమును పరిపాలించుటకు ఇష్టపడలేదు.

नियुज्यमानो राज्याय नैच्छद्राज्यं महाबलः ।

భరతుడు అరణ్యవాసము చేయుచున్న రాముని వద్దకు వెళ్ళి, తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యమును స్వీకరించమని కోరెను. రాముడు దానికి అంగీకరించక తన పాదుకలను భరతునికి ఇచ్చి అయోధ్యకు పంపించెను. భరతుడు రాముని పాదుకలను సింహాసనము మీద ఉంచి “నందిగ్రామము” నుండి పరిపాలనచేస్తూ రాముని కొరకు ఎదురుచూచుచుండెను తరువాత రాముడు చిత్రకూటమును వదలి దండకారణ్యములోనికి ప్రవేశించెను.

శ్రీరాముడు దండకారణ్యములో నివసించుట-దండకారణ్యములోనికి ప్రవేశించిన రాముడు “విరాధుడు” అనే రాక్షసుని చంపెను. శరభంగ మహర్షిని, సుతీక్షణ మహర్షిని, అగస్త్య మహర్షిని, ఆయన సోదరుని సందర్శించాడు. శ్రీరామునికి అగస్త్యుడు ఇంద్రునికి సంబంధించిన ఒక ఖడ్గము, ధనస్సు, అంతులేని బాణములుగల రెండు అమ్ముల పొదులు అనుగ్రహించెను.ఆ అరణ్యములో నివసించుచున్న మునులు రామున్ని కలుసుకొని తమను బాధిస్తున్న రాక్షసులను చంపవలసిందిగా కోరారు. రాముడు అలాగేనని వారందరికి మాట ఇచ్చెను. తరువాత రాముడు “శూర్పణఖ” అనే రాక్షసిని విరూపగా చేసెను. ఖరుడు, దూషణుడు, త్రిశురుడు అను రాక్షసులను వారి పరివారాన్ని రాముడు సంహరించెను. రాముడు దండకారణ్యములో ఉన్న సమయంలో జనస్థానములో నివసించుచున్న రాక్షసులను 14,000 (పదునాలుగు వేల) మందిని సంహరించెను.

रक्षसां निहतान्यासन् सहस्राणि चतुर्दश ।

ముగింపు- ఈ విధముగా దేవర్షి నారదుడు శ్రీరామ కథను వాల్మీకి మహర్షికి క్లుప్తముగా వివరించెను.

Introduction: The present lesson रामो विग्रहवान् धर्मः is an extract from first canto of Balakanda of Ramayana which is written by Adikavi Valmiki Maharshi.

वाल्मीकिः आदिकविः अजायत ।

Request of Valmiki:- Sage Valmiki wanted to write Ramayana as per instruction of Narada Maharshi. He requested divine sage Narada to tell about a person the greatest of human beings.

Oh! Sage is there any person who is virtuous, valorous, righteous, strong, grateful and strong in seeking truth in this world at present. I am anxious to know this. You can recognize such person, because you are roaming in three worlds.

Narada’s Reply:- Narada started telling, considering the request of Valmiki. There is a popular person named Rama, born in the dynasty of Ikshwaku. He is self-controlled, composed, valorous, courageous and skilled. He is righteous, truthful, famous, learned, wise, pious, and interested in welfare of the subiects.

Observing these qualities and his nature King Dasaratha happily wanted to coronate his eldest son Rama as crown prince. But Kaikeyi wanted her son Bharata as crown prince and Rama’s exile to forest as a boon to get her previous promises fulfilled.

पूर्वं दत्तवरा देवी वरमेनमयाचत ।

Dasaratha was bound to his earlier promise and sent Rama to forest for fourteen years.Rama’s exile:- Rama started to go to forest following a promise given to his father to favour Kaikayi. Sita followed Rama as the star Rohini followed the Moon. Lakshmana, the dearest and the most affectionate to Rama also followed him.

तं व्रजन्तं प्रियो भ्राता लक्षमणोऽनु जगाम ह ।

Rama was followed by King Dasaratha and people to a little farther. He left everyone on the banks of the river Ganges. There he met Guha, King of tribes and crossed the river with his help. Accompanied by sita, Lakshmana and guha rama reached chitrakuta crossing number of rivers and forest following instruction of the sage Bharadwaja.

Dasaratha’s depression:- King Dasaratha passed away with unbearable separation from his son Rama. Being sad for Rama’s stay in forest, Bharata, not interested to take responsibility of kingdom.

नियुज्यमानो राज्याय नैच्छद्राज्यं नियुज्यमानो ।

He along with sage Vasistha and other elders went to Chitrakuta to request Rama’s return to Ayodhya, but he refused to comeback and follow his father’s order. Then Bharata requested for padukas as a gift of grace.

Rama agreed for this and gave his padukas and sent back his brother Bharata. The latter returned with unfulfilled desire. He went to Nandigrama to take care of kingdom.After Bharata’s departure auspicious Rama reviewed situation and went to the Dandaka forest expecting visit of people once again in Chitrakuta.Chitrakuta.

Gift of Agastya Maharshi:-In the Dandaka forest, Rama killed demon, Viradha and met sages Agastya, Sarabhanga, Suteekshana and Agastya’s brother (Sudarsana). He took the bow of Indra, a sword, and a pair of quivers with inexhaustible arrows.

Dwelling sages of that forest met Rama and requested him to kill demons troubling them. Rama promised sages to kill demons of the for-est. He disfigured Surpanakha, dweller of Janastana.

Then Rama killed Khara, Trisira, Dushana and their followers, instigated by Surpanakha. He also killed fourteen thousand demons in Janastana.

रक्षसां निहतान्यासन्सहस्त्राणि चतुर्दश ।

Conclusion:- Here Rama was shown as ideal person following order of his father and embodiment of Dharma.

Leave a Comment